31, మార్చి 2026, మంగళవారం

వేమన కాలం

ప్రజాకవి వేమన – కాలం, వంశం, పరిశోధనలు

విభేదించిన గోవర్‌ వేమన్నను 12వ శతాబ్దానికి ఈడ్చుకుపోయాడు. బార్‌నెట్‌ కూడా మరీ విస్తూరంగా వేమన అనే వాడు ఒకడున్నాడా అని వితర్కించాడు.

దేశీయులలో రాయవరపు పూర్తయాచారి ఇచ్చిన కొండవీటి రాజుల వంశవృక్షాన్ని కొమర్రాజు లక్ష్మణరావుగారు ఖండించారు. కాబట్టి 14, 15 శతాబ్దాలలో వేమన లేడని తేలింది. పూర్తయాచారి కొండవీటి సంగతిని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు సమర్థించారు.

వేమన రాజవంశంతో సంబంధంలేని రైతు కుటుంబానికి చెందినవాడని బండారు తమ్మయ్యగారు అభిప్రాయపడ్డారు. “సను” శబ్దానికే తృప్తికరమైన అర్థం చెప్పడం కుదరదు. కటార్లవల్లై వేమన మన వేమన కాడు. కాని మన వేమనకు కటార్లవల్లైతో సంబంధం లేకపోలేదు.

అవతారికలో స్తుతించబడిన వేమన మన వేమన కాడు. నందన సంవత్సర పద్యాన్ని నమ్మలేము. వేమన్న వాడిన పద్యాలలోని వాడుకలను బట్టి వేమన 1650 ప్రాంతంవాడని ఖండించడానికి వీలులేదు.

పద్యాలలోని చారిత్రక వ్యక్తులెవరూ స్పష్టమైన రేఖలతో, నిర్వివాదంగా వెలువడలేదు. దేశీయులు పేర్కొన్న కాలాలు ఈ విధంగా ఉన్నాయి:

  • వంగూరి సుబ్బారావు గారు – 1412-1480
  • శేషాది రమణ కవులు – 1460-1600
  • వేదం వెంకటకృష్ణ శర్మ గారు – 1565-1625
  • వేటూరి ప్రభాకరశాస్త్రి గారు – 1650
  • బండారు తమ్మయ్య గారు – 1652-1725
  • రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు – 1700

అబే దుబాయ్‌ చెప్పిన కాలానికీ, బ్రౌన్‌ చెప్పిన కాలానికీ, బండారు తమ్మయ్యగారు తేల్చిన కాలానికీ పెద్ద తేడా లేదు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి కాలానికి బండారు తమ్మయ్యగారి కాలానికి భేదం 60–70 సంవత్సరాలే.

అబే దుబాయ్‌తో ప్రారంభమై బండారు వారితో ముగిసిన 17వ శతాబ్దమే వేమన కాలంగా చెప్పదగినది. కచ్చితంగా చెప్పాలంటే వేమన కాలం 1650 ప్రాంతంగానే తేల్చవచ్చు. ప్రాచీన ప్రతులు కూడా దీనినే సమర్థిస్తున్నాయి.

వేమన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడని నిర్ణయించవచ్చు.


కుడువ ముడువ లేక విడువ 

నుడువు లేక నడ యాడు వాని 

నడ పీనుగండ్రు 

కథానిక

తృప్తి| Concept 2041 Story in Telugu 🌸 – తృప్తి Concept 2041 Pictorial Story SCENE 1: నలుగురు స్నేహితులు ధనవం...