పోతన గారి భాగవత పద్యం పోతన గారి భాగవత పద్యం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా... కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! సరస్వతీ మాత దర్శనం పోతన గారికి ఇంకా కాలేదు. ఆ దర్శనం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ, ఆ మాతృమూర్తి రూపాన్ని తన ఊహల్లో నిర్మించుకుంటున్నారు. అందరూ చెబుతారు — సరస్వతీ మాత తెల్లని కాంతితో ప్రకాశిస్తుందని. అయితే ఆ తెలుపు ఎలా ఉంటుంది? అని కవి ఆలోచనలో పడతాడు. శరత్ మేఘాలు, చంద్రుడు, పచ్చకర్పూరం, చందనం, రాజహంస, మల్లెలు, మంచుతుంపర్లు, సముద్ర నురుగు, వెండికొండలు, ఆకాశగంగ — ఇలా ఎన్నో తెల్లని వస్తువులను ఊహించుకుంటాడు. అయినా అవేవీ సరస్వతీ మాత స్వచ్ఛమైన తెలుపుకు సరిపోలవు. చివరకు కవి ఆర్తితో అడుగుతాడు — “అమ్మా భారతీ! నిన్ను నా మనసులో ఎప్పుడు దర్శించగలను?”