ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్ 12, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు నెలలు

తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: 1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్లం అంటే తెలుపు అని అర్థం). 2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల వైశాఖము. పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల జ్యేష్ఠము . పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రంతో కలిసిన రోజు) అయితే ఆ నెల ఆషాఢము. పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (...